'ఈహిబు'లో జరిగే పోటీలను ప్రకటించటానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పోటీల్లో పాల్గొనటానికి కిందిచ్చిన అంశాల్లో మీకు బాగా నచ్చిన దానిని ఎంచుకుని, విజేతగా నిలిచి, ఆసక్తికర బహుమతులు గెలుచుకోండి (ఈ నిబంధనలు ప్రతి పోటీకి ప్రత్యేకం).
ఇది ప్రత్యేకంగా మీకోసమే రూపొందించిన పుస్తకం కాబట్టి మీ ఆలోచనల్ని ఇక్కడ మాతో పంచుకోవచ్చు. ఈ రెండు విభాగాల్లో మీకు నచ్చినదానిలో పాల్గొనచ్చు..!
(1) కింద కేటాయించిన స్థలంలో మీరు ఎంచుకున్న అంశానికి సంబంధించిన వ్యాసాన్ని రాయండి, లేదా ఎ4 షీట్లో రాసి, ఫొటో తీసి అప్లోడ్ చేయండి.
(2) అంశానికి సంబంధించిన ఒక పెయింటింగ్‌ను అప్లోడ్ చేయొచ్చు, లేదా మీరు సేకరించిన ఏదైనా ఫొటోను అప్లోడ్ చేసి, ఇచ్చిన అంశానికి ఆ ఫొటోని ఎలా అనుసంధానం చేస్తారో తెలియజేయండి. ప్రస్తుతం జరిగే పోటీలో మీకు బాగా నచ్చిన అంశంపై ఎంట్రీలను అప్లోడ్ చేయండి.
కింద కేటాయించిన స్థలంలో మీ వ్యాసాన్ని టైప్ చేయండి, లేదా ఏ4 పేపర్ పై ఈ కిందిచ్చిన రెండు అంశాల్లో నచ్చిన దానిని ఎంచుకుని, 300 పదాలకు మించకుండా రాసి, ఫొటో తీసి అప్లోడ్ చేయండి. అయితే ఫైల్ సైజ్ 1 ఎంబి మించకూడదు. బాగా రాసిన వారికి ఆసక్తికర బహుమతులు ఇవ్వబడును. వ్యాసాన్ని టైప్ చేసే ముందు మీ పేరు, మొబైల్ నెంబర్, తరగతి, వయసు, ఉంటున్న ప్రాంతం.. లాంటి పూర్తి వివరాలు స్పష్టంగా రాయండి, తద్వారా బహుమతులు ఇచ్చే సమయంలో మిమ్మల్ని సంప్రదించడం తేలికవుతుంది. మీ వివరాలు స్పష్టంగా లేనట్త్లెతే ఎంట్రీస్ రద్దు చేయబడతాయి. ఉదాహరణ కోసం నమూనా షీట్లను గమనించవచ్చు.
పెయింటింగ్‌ను మీరు అందంగా గీయగలిగితే నమూనా షీట్లలో చూపించిన విధంగా మీ పేరు, మొబైల్ నెంబర్, తరగతి, వయసు, ఉంటున్న ప్రాంతం.. లాంటి వివరాలు స్పష్టంగా రాసి, ఫొటో తీసి, జెపిఈజిఫైల్ను అప్లోడ్ చేయండి. మీ ఆలోచనలకు అద్దం పడుతూ, ఇచ్చిన అంశానికి సంబంధించిన ఫొటో ఏదైనా మీ దగ్గరుంటే మాతో పంచుకోండి. ఆ ఫొటోను మీరెలా సేకరించారో మాకు తెలియజేయండి, అయితే ఫైల్ సైజ్ 1 ఎంబిని మించకూడదు. ఉదాహరణ కోసం నమూనా షీట్లను గమనించవచ్చు.